![]() |
![]() |

సర్కార్ సీజన్ 5 ఈ వారం ఎపిసోడ్ ఫుల్ ఫన్నీగా సాగింది. ఇందులో రకరకాల ప్రశ్నలు అడిగాడు. ఈ షోకి ఆరియానా, వర్షిణి, దేత్తడి హారికా, శ్రీసత్య వచ్చారు. వచ్చే ముందు సుధీర్ ని ఆటపట్టించారు. ఇక ఒక ప్రశ్న అడిగారు సుధీర్ ఇందులో. "లక్ష రూపాయల్లో ఎన్ని 500 నోట్లు ఉంటాయి " అని అడిగాడు. ఈ ప్రశ్నకు క్లూస్ కోసం అందరూ డబ్బులు బిడ్డింగ్ పెంచుతూ వెళ్తున్నారు. ఆరియానా ఆశాలు బిడ్ చేయకపోయేసరికి సుధీర్ అడిగాడు ఎందుకు బిడ్ చేయట్లేదని. దానికి ఆరియానా ఏంటి నువ్వు ? అని అడిగాడు. "మీరు లెక్కలు అడిగారు నేను లెక్కల్లో చాలా పూర్. నా పరువు పోతుందని భయం" అంది. "ఎప్పుడన్నా మనకు ఉన్నదాని గురించి పోయిద్దా అని ఆలోచించాలి" అని కౌంటర్ వేసాడు.
"ఎందుకంటే ఇంత కఠినంగా ఉంటారు మీరు" అని మళ్ళీ సుధీర్ అడిగేసరికి "ఇంత కఠినంగా ఉండే మీరు మమ్మల్ని కఠినంగా" అంటూ ఆ కఠినం అనే పదాన్ని పలకలేకపోయింది. దాంతో సుధీర్ "నీకు ఇంగ్లీష్ కాదు తెలుగు కూడా రాదు" అనేశాడు. "ఎలా లెక్కపెట్టాలి" అంటూ హారిక ఫైనల్ గా 200 అంటూ ఆన్సర్ చెప్పింది. దాంతో సుధీర్ షాకై చూస్తూ "మీ తెలివితేటలకు ఒక దణ్ణం..నా ప్రాబ్లమ్ మిమ్మల్ని ఎవరు చేసుకుంటారన్నది కాదు. మీ పిల్లలకు చదువులు ఎం చెప్తారా అన్నదే భయంగా ఉంది" అన్నాడు సుధీర్. దానికి వర్షిణి "మేమే చదవలేదు..మా పిల్లలకేం చదువు చెప్తాము ఇంకా" అంది. "అదే నా భయం పొరపాటున ఇంట్లో ఏదన్నా డౌట్ ఉంటే అని. అమ్మా లక్షలో ఎన్ని 500 లు ఉంటాయి అని పిల్లలు అడిగితే ఆ 100 అన్నారనుకో మొత్తం పోయినట్టే కదా " అంటూ కౌంటర్ వేసాడు.
![]() |
![]() |